చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో రెండు కొత్త టీమ్ లు చేరాయి. కొచ్చి, పుణె నగరాలకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు మంజూరయ్యాయి. కొచ్చీ ఫ్రాంఛైజీని రెండజ్వస్ స్పోర్ట్స్ వరల్డ్ లిమిటెడ్ దక్కించుకోగా, పుణె ఫ్రాంచైజీని సహారా గ్రూప్ కైవశం చేసుకుంది. ఐపీఎల్ - 4 లోఈ జట్లు పోటీపడనున్నాయి.
వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్ బిడ్ల ప్రక్రియ ఆదివారం కొలిక్కివచ్చింది. ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ చెన్నైలో బిడ్లను తెరిచారు. వివిధ పట్టణాల ఫ్రాంచైజీల కోసం దాదాపు ఐదు సంస్థలు బిడ్లను దాఖలు చేసాయని ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ మీడియాతో చెప్పారు. సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ గ్రూప్ అత్యధికంగా 370 మిలియన్ల డాలర్లతో మూడు పట్టణాల కోసం బిడ్ దాఖలు చేసిందని వివరించారు. అహ్మదాబాద్, నాగ్ పూర్ , పుణె నగరాల్లో ఎదో ఒక ఫ్రాంచీజీని కావాలని ఆ సంస్థ కోరిందని మోడి చెప్పారు. అయితే పుణె నగర ఫ్రాంచైజీని సహారా గ్రూప్ నకు కేటాయించినట్లు మోడీ వెల్లడించారు. అలాగే రెండెజ్వస్ స్పోర్ట్స్ వరల్డ్ లిమిటెడ్ సంస్ధ 333.33 మిలియన్ల డాలర్ల రెండో అత్యధిక మొత్తంతో కూడిన బిడ్ ను దాఖలు చేసిందన్నారు. ఈ మేరకు ఆ సంస్థకు కొచ్చీ పట్టణాన్ని కేటాయించామని మోడీ తెలిపారు.
ఐపీఎల్ కు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో రెండో బోర్డును ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని మీడియా ప్రస్తావించగా, మోడీ అటువంటి ప్రతిపాదనేమీ లేదని కొట్టిపారేసారు. ఐపీఎల్ ను ఇప్పటికిప్పుడు విస్తరించాలన్న యోచన ఏమీ తమకు లేదని స్పష్టం చేసారు. అలాగే ఆదానీ గ్రూప్, వీడియోకాన్ వంటి సంస్థలు కూడా బిడ్డింగ్ లో పాల్గొన్నప్పటికీ ఫలితం లేకపోయింది.
ముంబాయి : ఐపీఎల్ క్రికెట్‌లో చెనై్న సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మహేంద్రసింగ్ ధోనీ 15 రోజుల పాటు దూరం కానున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం రాత్రి ఆడిన మ్యాచ్‌లో ధోని మోచేతికి గాయం కావడంతో ధోనీ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ధోనీ స్థానంలో సురేష్ రైనా తాత్కాలికంగా చెనై్న సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ముంబై: ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. 20 ఓవర్లలలో 212/6 పరుగులు చేసింది. రాజస్థాన్స్ రాయల్స్ 20 ఓవర్లులలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి కేవలం 4 పరుగుల తేడాలో పరాజయం పాలైంది.
రాయల్స్ ఆల్ రౌండర్ శారు. యూసుఫ్ పఠాన్ 37 బంతులలో (9×4 , 8×6 ) 100 పరుగులు సాధించి వీరవిహారం చేసినప్పటికీ తన జట్టు విజయం సాధించలేకపోయింది. ఐపీఎల్‌లో -3 తొలి సెంచరీ పఠాన్ దే కావడం విశేషం. 4 పరుగుల తేడాతో ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. దోగ్రా 41, పఠాన్ 100 , చివరిలో ఇద్దరూ రన్‌అవుట్ కావడంతో మ్యాచ్ ముంబయి ఇండియన్స్ దక్కింది.
ఐక్యరాజ్య సమితి : భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండుల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమానికి (యుఎన్ఇపి) గుడ్ విల్ అంబాసడర్ గా సచిన్ ను నియమించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన తొలి క్రికెటర్ గా సచిన్ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ప్రజాభిమానం సచిన్ పురిటిగడ్డ భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను పర్యావరణంపై ప్రజల్లో చక్కని అవగాహన కలగించడానికి, పర్యావరణ పరిరక్షణకు చక్కగా ఉపయోగపడుతుందని శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో యుఎన్ఇపి అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా టెండుల్కర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ భూమిపై క్రికెట్ ఆడుతూ తాను అపరిమితానందం పొందుతున్నానన్నాడు. మనందరికీ ఇంత చోటు కల్పించిన ఈ భూమి కోసం ఇక ఇప్పుడు తాను ఏదైనా చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భూమి పరిరక్షణ అందరి ముందున్న ప్రధాన లక్ష్యం అన్నాడు. తనకు లభించిన సరికొత్త బాధ్యత ద్వారా వాతావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నాడు. యుఎన్ఇపితోను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి అభిమానులతోను కలిసి పనిచేయడం ద్వారా లక్ష్యం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు.
మంచి లక్షణం, మనో పరిపక్వత, వివేకం, వ్యక్తిత్వం ఉన్న టెండుల్కర్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు చక్కని ప్రచారం లభిస్తుందని, ఎక్కువ శాతం మందిలో అవగాహన కలుగుతుందన్న ధీమాను యుఎన్ఇపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషిం స్టీనర్ వ్యక్తం చేశారు. 2010 యుఎన్ అంతర్జాతీయ బయో డైవర్శిటీ సంవత్సరాన్ని పురస్కరించుకొని సచిన్ తమ సంస్థతో కలిసి పనిచేయడం హర్షదాయకం అన్నారు. జంతు సంతతి క్షీణించడం వల్ల ప్రపంచ పర్యావరణంపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతున్నదీ అత్యంత కింది స్థాయి ప్రజల్లో కూడా సచిన్ ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. సచిన్ టెండుల్కర్ గతంలో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) తరఫున ప్రచారం చేశాడు.
ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసడర్ గా సచిన్ నిర్వహించాల్సి ప్రధానమైన విధుల్లో భూమిపై పర్యావరణాన్ని కాపాడతామంటూ 'గ్రీన్ ప్లెడ్జ్'పై ప్రమాణం చేయిండం. ముంబాయిలోని డివై పాటిల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ముంబాయిలో ప్రారంభమవుతున్న మూడవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఉత్సవంలో ఈ ప్రమాణాన్ని చేయిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీల్లో తిలకిస్తుండగా గ్రీన్ ప్లెడ్జ్ ను సచిన్ నిర్వహిస్తాడు. 'The Earth is our home and together we must conserve our precious wildlife, forests and oceans. I am proud to pledge that I will play my part in caring for our natural heritage' అంటూ సచిన్ గ్రీన్ ప్లెడ్జ్ ప్రమాణం చేయిస్తాడు.
ముంబయి : వచ్చే ఏడాది జరిగే నాలుగో విడత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 టోర్నీలోకి కొత్తగా అడుగుపెట్టబోయే ఫ్రాంచైజ్‌లు ఎవరికి దక్కుతాయో తెలియడానికి మరి కొంత నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకు ముందే పిలిచిన బిడ్డింగ్‌లను ఆదివారం తెరుస్తామని, కొత్త ఫ్రాంచైజ్‌ల పేర్లను ప్రకటిస్తామని టోర్నమెంట్ కమిషనర్ లలిత్ మోడీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఫ్రాంచైజ్‌ల కోసం ఖరారు చేసిన నిబంధనల పట్ల నిరసనలు వెల్లువెత్తడంతో, గత్యంతరం లేక బిడ్డింగ్‌ను ఐపిఎల్ నిర్వహణ కమిటీ వాయిదా వేసింది. చాలా మంది ఔత్సాహికులు డిమాండ్‌లను దృష్టిలో ఉంచుకొని, నిబంధనలను మారుస్తున్నట్టు లలిత్ మోడీ ఆదివారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు. ఇప్పటికే అందిన బిడ్‌లు తెరవకుండానే వెనక్కు ఇచ్చేస్తున్నట్టు చెప్పాడు.
సవరించిన నిబంధలతో ఈనెల తొమ్మిది కొత్త బిడ్‌లకు ఫారాలను జారీ చేస్తామని, మార్చి 21వ తేదీ ఉదయం పది గంటల్లోగా చెన్నైలో జరిగే సమావేశంలో వాటిని సమర్పించాల్సి ఉంటుందని వివరించాడు. 11 గంటలకు బిడ్‌లను తెరుస్తామని, కొత్త ఫ్రాంచైజ్‌ల ఎంపికను పూర్తి చేస్తామని వివరించాడు. బిడ్‌లను వేసే సమయానికే 100 కోట్ల రూపాయలను బ్యాంక్‌లో డిపాజిట్ చేయడమేగాక, 430 కోట్ల రూపాయలకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని తొలుత నిర్ణయించామని, అయితే, చాలా మంది ఈ నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని మోడీ పేర్కొన్నాడు. ఈమేరకు తనకు చాలా లేఖలు అందాయని అన్నాడు. అందుకే, డిపాజిట్ మొత్తాన్ని 10 కోట్లకు తగ్గించామని తెలిపాడు. అదే విధంగా బిడ్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంచైజ్‌లు ఆతర్వాత 48 గంల్లోగా 43 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ చూపితే సరిపోతుందని అన్నాడు. డిపాజిట్, బ్యాంక్ గ్యారంటీ మొత్తాలను తగ్గిస్తున్నప్పటికీ, ఒక్కో ఫ్రాంచైజ్‌కి నిర్ధారించిన 225 మిలియన్ డాలర్ల బేస్ ప్రైస్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని అన్నాడు
ఆహ్మదాబాద్ : మున్నాభాయ్ ఎంబిబిఎస్.. నిన్నటి టైటిల్ . మున్నాభాయ్ ఐపీఎల్ లెటెస్ట్ టైటిల్. కాకపోతే మీరనుకుంటున్నట్లు మున్నాభాయ్ ఐపీఎల్ సంజయ్ దత్ తీస్తున్న కొత్త సినిమా కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సంజయ్ దత్ ఏర్పాటు చేస్తున క్రికెట్ టీమ్ మాత్రమే. అవును మన మున్నాభాయ్ కూడా ఐపీఎల్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేస్తున్నాడు. షారుఖ్, ప్రీతీ, శిల్పల తర్వాత మున్నాభాయ్ కూడా ఐపీఎల్ పిచ్ పై అదృష్టం పరీక్షించుకోడానికి సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ అహ్మదాబాద్ ఫ్రాంఛీజీ మంజూరు కావడం దాదాపు ఖరారు కావడంతో దానిని దక్కించుకునేందుకు మున్నాభాయ్ తహతహలాడుతున్నాడు. యాక్షన్ కింగ్ అజయ్ దేవగన్ తో చేతులు కలిపి ఐపీఎల్ - 4 పిచ్ పైకి మున్నాభాయ్ దిగుతున్నాడు. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన ఈ హీరోలు ఐపీఎల్ లో కూడా రికార్డులు సృష్టించేందుకు రంగంలోకి దిగుతున్నారు.
ఐపీఎల్ ఫ్రాంఛైజీని చేజిక్కుంచుకోవడమంటే ఇప్పుడు మాటలు కాదు. ఒకప్పుడు సులభంగానే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మంజూరైనా ఇప్పుడు దాని నిబంధనలను మరింత కఠినం చేసారు. గతంలో కేవలం 67 మిలియన్ డాలర్లకే ఫ్రాంఛైజీ లభించేది. కానీ తాజా నిబంధనల ప్రకారం 225 డాలర్ల మిలియన్ల పెడితేనే కాని ఫ్రాంఛైజీ దక్కే అవకాశాలు లేవు. బిడ్ దాఖలు చేసే వ్యక్తి కనీసంగా ఒక బిలియన్ ఆస్తికి యాజమానిగా ఉండాలి. భాగస్వాముల పెట్టుబడిని కలుపుకొని 225 మిలియన్ డాలర్లను బిడ్డింగ్ సంస్థ కలిగి ఉండాలని కూడా నిబంధన ఉంది. ఐపీఎల్ తాజాగా మరో 7 కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా. వీటిలో అహ్మదాబాద్ కు ఓ ఫ్రాంఛైజీ మంజూరయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి గతంలోనే అహ్మదాబాద్ కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రావాల్సి ఉంది. అయితే ఆ అవకాశం తృటిలో తప్పింది. ఖర్చులు తక్కువగా ఉండటంతో జైపూర్ ఫ్రాంచైజీ అవకాశాన్ని దక్కించుకుంది. ఎమర్జింగ్ మీడియా సంస్థ కేవలం 67 మిలియన్ డాలర్లకే ఫ్రాంఛైజీ ఛాన్స్ కొట్టేసింది.
ఐపీఎల్ తాజాగా ప్రకటిస్తున్న ఫ్రాంచైజీల జాబితాలో అహ్మదాబాద్ ఉండటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇక్కడి మోతీరా స్టేఢియంలో మౌలిక వసతులు మెరుగ్గా ఉండం, సంజయ్ దత్ , అజయ్ దేవగన్ వంటి బిగ్ షాట్స్ భాగస్వామ్యంతో బిడ్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం కావడం కలలి అహ్మదాబాద్ కు ఫ్రాంఛైజీని తెచ్చిపెట్టడం ఖాయమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్, మరో కార్పొరేట్ కంపెనీ కలసి బిడ్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఐపీఎల్ - 4 ఫ్రాంఛైజీలు అహ్మదాబాద్ తో పాటుగా పుణె, ఇండోర్, నాగ్ పూర్, ధర్మశాల వంటి నగరాలకు కూడా లభించవచ్చుని ఐపీఎల్ అధికారి ఒకరు చెప్పారు. కొత్తగా ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేసే నగరాల వివరాలను ఆదివారం ఐపీఎల్ ప్రకటించనుంది.
ముంబాయి : క్రికెట్ మాస్ట్రో సచిన్ టెండుల్కర్ పై రాళ్ళదాడులు చేసిన శివసేన ఇప్పుడు పూలగుత్తులతో ప్రశంసలు కురిపిస్తోంది! 'ముంబాయి అందరిదీ' అంటూ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తిపోయిన శివసేన సచిన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. మరాఠీలు కానివారెవరూ ముంబాయిలో ఉండడానికి వీల్లేదంటూ శివసేన ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో సచిన్ పై విధంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ లో జరిగిన రెండో వన్డేలో సచిన్ టెండుల్కర్ చేసిన 'అజేయ ద్విశతకం' ఇప్పుడు ఆయన విమర్శకుల నోళ్ళు మూయించడమే కాదు, శివసేనను కూడా క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ ద్విశతకంతో వన్డేల్లో సచిన్ ప్రపంచ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.
'వీరులు మహారాష్ట్రలోనే పుడతారు. మొఘలులను ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ఓడించాడు. క్రికెట్ యుద్ధంలో సచిన్ టెండుల్కర్ కూడా అలాంటి వాడే. యుద్ధంలో శివాజీ తన కరవాలాన్ని వినియోగించాడు. అదే విధంగా సచిన్ తన బ్యాట్ ను ఉపయోగించాడు' అంటూ ప్రశంసించారు శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే. 'నూరు కోట్ల భారతీయులు సచిన్ టెండుల్కర్ కు ఎప్పుడో భారతరత్న కిరీటాన్ని అలంకరించారు' అంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో ప్రశంసల జల్లు కురిపించారు. సచిన్ కు భారతరత్న ఇవ్వాలని ఎవ్వరూ రికమండ్ చేయాల్సిన అవసరం లేదంటూ బాల్ థాకరే తన సంపాదకీయంలో రాశారు. ఎందుకంటే సచిన్ ఇప్పటికే 'భారతరత్న' అని ప్రశంసించారు.
ముంబాయి : క్రికెట్ మాస్ట్రో సచిన్ టెండుల్కర్ పై రాళ్ళదాడులు చేసిన శివసేన ఇప్పుడు పూలగుత్తులతో ప్రశంసలు కురిపిస్తోంది! 'ముంబాయి అందరిదీ' అంటూ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తిపోయిన శివసేన సచిన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. మరాఠీలు కానివారెవరూ ముంబాయిలో ఉండడానికి వీల్లేదంటూ శివసేన ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో సచిన్ పై విధంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ లో జరిగిన రెండో వన్డేలో సచిన్ టెండుల్కర్ చేసిన 'అజేయ ద్విశతకం' ఇప్పుడు ఆయన విమర్శకుల నోళ్ళు మూయించడమే కాదు, శివసేనను కూడా క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ ద్విశతకంతో వన్డేల్లో సచిన్ ప్రపంచ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.
'వీరులు మహారాష్ట్రలోనే పుడతారు. మొఘలులను ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ఓడించాడు. క్రికెట్ యుద్ధంలో సచిన్ టెండుల్కర్ కూడా అలాంటి వాడే. యుద్ధంలో శివాజీ తన కరవాలాన్ని వినియోగించాడు. అదే విధంగా సచిన్ తన బ్యాట్ ను ఉపయోగించాడు' అంటూ ప్రశంసించారు శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే. 'నూరు కోట్ల భారతీయులు సచిన్ టెండుల్కర్ కు ఎప్పుడో భారతరత్న కిరీటాన్ని అలంకరించారు' అంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో ప్రశంసల జల్లు కురిపించారు. సచిన్ కు భారతరత్న ఇవ్వాలని ఎవ్వరూ రికమండ్ చేయాల్సిన అవసరం లేదంటూ బాల్ థాకరే తన సంపాదకీయంలో రాశారు. ఎందుకంటే సచిన్ ఇప్పటికే 'భారతరత్న' అని ప్రశంసించారు.
Loading Poll...