నెల్లూరు: ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకయ్యాయి. అధ్యాపక సిబ్బందే లీకేజీకి సూత్రధారులు కావడం గమనార్హం. నెల్లూరు నగరంలోని కృష్ణచైతన్య కళాశాలలో ఇంటర్ పరీక్షా పత్రాలు లీక్‌కావడం సంచలనం సృష్టించింది. కళాశాలకు చెందిన కొందరు సిబ్బంది పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలను బయటకు తీసుకువెళుతుండగా స్పెషల్ పార్టీ పోలీసులు వారిని పట్టుకోవడంతో లీక్ వ్యవహారం బయటపడింది.
ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పేపర్ ను పరీక్ష సమయానికి ముందే సిబ్బంది కొందరు విద్యార్ధులకు లీక్ చేశారు. మూడు రోజుల క్రితమే అనుమానం వచ్చిన పోలీసులు కళాశాలపై నిఘాపెట్టారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్ధులను, ఆరుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళాశాల యాజమాన్యం పరారీలో ఉంది
న్యూఢిల్లీ : విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో అనుబంధ శాఖలు ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లు-2010కి ఆమోదం తెలిపింది.
నాలుగేళ్ళుగా వివాదాల్లో నలుగుతున్న ఈ బిల్లుకు క్యాబినేట్ ఆమోదం లభించడంతో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో విద్యా రంగ పురోభివృద్ధికి ఈ బిల్లు దోహదం చేస్తుందని మంత్రివర్గ సమావేశానంతరం కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లుపై నాలుగేళ్ళ నుంచి వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం హడావుడిగా దీనిని ఆమోదించడం చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
దీనితో గత ఏడాది ఈ బిల్లును కమిటి ఆఫ్ సెక్రటరీస్ పరిశీలించి చిన్న చిన్న మార్పులు సూచించింది. అయితే దీన్ని లెఫ్ట్ పార్టీలు సహా ఎవరూ అంగీకరించలేదు. ఉన్నట్లుండి ఈ బిల్లు మళ్ళీ తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ చట్టం ప్రకారం విదేశీ విశ్వవిద్యాలయాలు భారత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న ఎనిమిది నెలల లోపు అనుబంధ శాఖను ఏర్పాటు చేసుకొని యుజిసి లేదా స్థానిక రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులు పొందాలి. లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన అనుమతి రద్దవుతుంది.
విశాఖ : ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పరీక్షా పత్రాలు తారుమారయ్యాయి. సోమవారం విశాఖ ఉమెన్స్ కాలేజీలో అసలు సిరీస్‌కు బదులు సప్లిమెంటరీ పత్రాలను సరఫరా చేశారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. కాగా... కరీంనగర్ మానకొండూరలో సైతం ఇదేవిధమైన గందరగోళం నెలకొంది. పరీక్ష పూర్తయిన తర్వాత జరిగిన తప్పును టీచర్లు గుర్తించారు. ఇక కర్నూలు జిల్లా కోడుమూరులో ఒక సెట్ పేపర్‌కు బదులు మరో సెట్ ేపేపర్లను ఇన్విజిలేటర్లు సరఫరా చేశారు. తప్పు తెలుసుకున్న ఎగ్జామినర్లు మళ్లీ పరీక్ష పెట్టారు.
హైదరాబాద్, మార్చి 13: దేశంలో అన్ని ఉన్నత విద్యా సంస్థలు, వర్శిటీల గుర్తింపునకు అఖిల భారత అక్రిడిటేషన్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డి. పురంధ్రీశ్వరి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఇ హస్నైనీలతో కలిసి ఆయన ఒక హోటల్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ శనివారం నాడు సెంట్రల్ యూనివర్శిటీలో నిర్వహించిన 21 మంది కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. సెంట్రల్ యూనివర్శిటీల పనితీరు, వాటి స్థాయిత్వం పెంచడం, సెమిస్టర్ విధానం, ఉన్నత విద్యను విద్యార్ధులకు మరింత చేరువ చేయడం, వర్శిటీలకు స్వేచ్ఛనుకల్పించడం, విద్యార్ధుల బదలాయింపు , వారి క్రెడిట్స్ మార్పిడి, నూతన సంస్కరణలు , యూనివర్శిటీల సేవలను విస్తృతం చేయడం , ప్రజావసరాలకు వినియోగించడం సహా అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని మంత్రి వివరించారు. వైస్ ఛాన్సలర్ల మేథోమదనంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
సెంట్రల్ యూనివర్శిటీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఏడుగురు విసిలతో జాతీయ సలహా సంప్రదింపుల ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నామని, ఈ కమిటీ ప్రతి నాలుగు నెలలకోమారు సమావేశమై పలు అంశాలపై చర్చించి, హెచ్‌ఆర్‌డికి సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు. పలు అంశాలపై అవసరమైతే సబ్ కమిటీలను వేస్తామని చెప్పారు. అమెరికాలో ఉన్నట్టు యూనివర్శిటీల్లో సైతం నవరత్నాలను గుర్తిస్తామని, ఐవి లీగ్ తరహాలు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చి వాటికి స్వయంప్రతిపత్తిని, మరింత స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అవసరమేతే తమ బడ్జెట్ పరిమితులకు లోబడి పెద్ద ఎత్తున బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. నేరుగా అసోసియేట్ ప్రొఫెసర్లను, ప్రొఫెసర్లను తీసుకునేందుకు కూడా విసిలకు అధికారాలు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బోధనేతర సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉందని, దానినీ సవరిస్తామని అన్నారు.
2013 నుండి దేశవ్యాప్తంగా యుజి కోర్సుల ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నామని, సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఒక కమిటీని వేశామని పేర్కొన్నారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఈ ప్రవేశపరీక్షకు విద్యార్ధులు సిద్ధంకావాలని ఆయన హితవుపలికారు. పాఠశాల విద్య సంస్కరణల్లో యూనివర్శిటీ విద్య ప్రభావాన్ని చూపేందుకు అన్ని కేంద్రీయ వర్శిటీల్లో నాలుగేళ్ల బి.ఎస్సీ ఇడి కోర్సును ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మధ్యలో విద్యార్ధి అవసరం అనుకుంటే వేరే కోర్సులో చేరేలా దీనిని రూపొందిస్తున్నామని చెప్పారు. యూనివర్ళిటీల్లో లీడర్‌షిప్ ప్రొగ్రాం, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రొగ్రాం ఆఫర్ చేయాలని సూచిస్తున్నామని, తద్వారా వర్శిటీలు ఆర్ధికంగా స్థిరపడటంతో పాటు సాయంత్రం పూట ఖాళీగా లేకుండా వర్శిటీల సేవలను అందించడం సాధ్యపడ్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ : ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు ప్రతి ఏటా పునరుద్ధరించేందుకు జాతీయ సాంకేతిక విద్యా మండలి ఈ ఏడాది నుండి ఏర్పాటు చేసిన నూతన విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన ప్రైవేటు యాజమాన్యాలకు ఊరట లభించేలా ఉంది. ప్రతి ఏటా ప్రతి కాలేజీ తన గుర్తింపును పునరుద్ధరించుకోవల్సి ఉంటుంది. ఎన్‌బిఎ వంటి అసెస్‌మెంట్ బోర్డులు గుర్తిస్తే తప్ప ప్రతి ఏటా నిర్బంధంగా తమ గుర్తింపునకు ఎఐసిటిఇకి ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 9వ తేదీన ఈ దరఖాస్తు విధానాన్ని మారుస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎఐసిటిఇపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా చూసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎవరూ ఎఐసిటిఇ ప్రధానకార్యాలయానికి రాకుండా దరఖాస్తు ఏ దశలో ఉన్నదీ, లోపాలు ఉంటే వాటి వివరాలతో సహా ఎప్పటికపుడు తెలియజేసేలా ఈ విధానాన్ని రూపొందించారు. అన్ని రాష్ట్రాల్లోని కాలేజీలూ తమ గుర్తింపుకోసం దాదాపు 200 పేజీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎఐసిటిఇ పేర్కొంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించుకోవడం క్లిష్టం కావడంతో దీనిని ఎలాగైనా తప్పించుకోవాలని చూసిన యాజమాన్యాలు ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయారు. మరికొంత మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు.
తమిళనాడు హైకోర్టు దరఖాస్తును ఈ ఏడాదికి ఆన్‌లైన్‌లో పంపించనవసరం లేదని ఫిబ్రవరి 25న పేర్కొనగా, తాజాగా కేరళ హైకోర్టు శుక్రవారం నాడు ఈ ఏడాదికి పాత కాలేజీలకు ఈ విధానం నుండి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని యాజమాన్యాలు కూడా ఈ విధమైన రాయితీ లభిస్తుందనే ఆశతో ఉన్నాయి. ఇటీవలె అఖిల భారత యాజమాన్యాల కాన్సార్షియం సమావేశం హైదరాబాద్‌లోనే జరిగింది. రెండు మూడేళ్లపాటు ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని వాయిదావేయడంతో పాటు కొన్ని నిబంధనలను సడలించాలని యాజమాన్యాల ఫెడరేషన్ల కాన్సార్షియం కోరింది. ఆన్‌లైన్‌లో తొలి పేజీలోని వివరాలు సక్రమంగా ఉంటేనే మరో పేజీలోకి వెళ్లేవిధంగా పకడ్బందీగా రూపొందించడం కూడా యాజమాన్యాలకు మింగుడుపడలేదు. బోధన సిబ్బందిగా దాదాపు చాలా కాలేజీలు ఒకే వ్యక్తిని చూపించడం వంటి అక్రమాలకు ఆన్‌లైన్‌లో తావులేకుండా చేశారు.
ఒక లెక్చరర్ పేరును ఎంటర్ చేయగానే ఆ పేరును వేరే కాలేజీల వాళ్లు ఎంటర్ చేసి ఉంటే డూప్లికేషన్‌ను గుర్తించి దరఖాస్తును తిరస్కరించే విధానం ఆన్‌లైన్‌లో పెట్టారు. ఇది యాజమాన్యాలకు ఇరకాటానే్న సృష్టించింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎఐసిటిఇ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుత గడవు మార్చి 15తో ముగుస్తుంది.

Loading Poll...