బాలీవుడ్ లో సీక్వెల్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. తెలుగులో ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ మొదలైంది. చిరంజీవి 'శంకర్ దాదా ఎంబిబిఎస్'కు సీక్వెల్ గా 'శంకర్ దాదా జిందాబాద్', అల్లు అర్జున్ 'ఆర్య'కు సీక్వెల్ గా 'ఆర్య-2' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ చరణ్ తో 'జగదేకవీరుడు అతిలోక సుందరి-2' ఆలోచన ఉందని అశ్వనీదత్ ఆమధ్య ప్రకటించారు. తాజాగా మంచు ఫ్యామిలీ హీరో విష్ణు కథానాయకుడుగా 'పెదరాయుడు-2' చిత్రానికి ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలిసింది.
డాక్టర్ ఎం.మోహన్ బాబు, రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన 'పెదరాయుడు' చిత్రం అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందింది. తాజాగా విష్ణుకు సైతం ఓ హిట్ అనివార్యమవుతోంది. ఎన్నో అంచనాలతో ఇటీవల విడుదలైన 'సలీమ్' బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూడటంతో ఎలాగైనా మళ్లీ ఓ సరైన హిట్ కొట్టాలనే పట్టుదలతో విష్ణు ఉన్నాడు. ఇందులో భాగంగానే 'పెదరాయిడు-2' చిత్రానికి ఆయన సన్నద్ధమవుతున్నారనీ, మళ్లీ రవిరాజా పినిశెట్టికే దర్శకపగ్గాలు అప్పగించనున్నారనీ తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు రవిరాజా పినిశెట్టి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి, ఇటీవల బాలీవుడ్ లో ఓ హారర్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా విష్ణు కమిట్ అయినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన పూర్తవివరాలు వెల్లడి కానున్నాయి.
రంజిత తెలుగులో అంత పాపులర్ నటి కాకపోవచ్చు కానీ ఈమధ్యనే నిత్యానంద స్వామి సెక్స్ స్కాండిల్ లో చిక్కుకోవడంతో ఒక్కసారిగా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. స్వామీజీ ముఖం చాటేస్తూ 'కుంభమేళా' తర్వాత జనం ముందుకు వస్తానంటూ చెబుతుంటే, రంజిత సైతం ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు. ఒకటి రెండు ఫోన్ స్టేట్ మెంట్లు మాత్రం వెలుగుచూశాయి. ఆ మాట అంటుంచితే నిత్యానంద-రంజిత సెక్స్ భాగోతం బయటకు రావడంతో ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ కు యమ గిరాకీ పెరిగింది. దీంతో కొందరు ముష్కరులకు చేతినిండా పని పడింది. 'రంజిత న్యూడ్ వీడియో ఫుల్ వెర్షన్' పేరుతో ఓ ఇ-మెయిల్ ను వదులుతున్నారు.
ఇ-మెయిల్ క్యాప్షన్ చూసి ఎవరైనా కాస్త టెంప్ట్ అయ్యారో ఇక అంతే సంగతులు. మెయిల్ ను క్లిక్ చేస్తే ఇక పర్సనల్ కంప్యూటర్ ను కుప్పతొట్టిలో పడేయాల్సిందే. అందులో ఉన్నది వీడియో ఎంత మాత్రం కాదు. ఫుల్ లెంగ్త్ లో ఉండే వైరస్. అది నెటిజన్లు తేరుకునేలోగా సిస్టమ్ ను కమ్మేస్తుంది. రంజిత ను చూడాలనుకుంటే ఇతర మార్గాలు వెతుక్కుంటే మంచిది కానీ, ఇన్ బాక్స్ లోని ఇ-మెయిల్ కు దారి ఇచ్చారో కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది.
హైదరాబాదు : పైరసీకి వ్యతిరేకంగా సినిమా పరిశ్రమ గళమెత్తింది. పైరసీని తరిమి కొట్టేవరకు తమ పోరాటం ఆగదని సినీ ప్రముఖులు తీర్మాణించారు. ఇందులో భాగంగా 19న బంద్ పాటించనున్నట్లు సినీ పరిశ్రమ ప్రకటించింది. ఆ రోజు సినిమా థియేటర్లు సహా ఎటువంటి షూటింగు, రికార్డుంగు, ఆడియో, సినిమా రిలీజ్‌లు వంటి కార్యక్రమాలన్నీ జరగకూడదని సినీ ప్రముఖులు నిర్ణయించారు. ఈ బంద్‌కు ప్రతి సినీ కార్మికుడు సహకరించాలని కోరారు. 19 న ఏవైనా సినిమా రిలీజ్‌లు ఉంటే వారు వాయిదా వేసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రం ఫిలింఛాంబర్ వద్ద పైరసీకి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేస్తున్న రవించంద్, సురేందర్‌రెడ్డిలను సినీ ప్రముఖులు అల్లు అరవింద్, మురళీమోహన్, డి.సురేష్‌బాబు, దిల్‌రాజుతోపాటు ఇతర సినీ కళాకారులు పరామర్శించారు.
న్యూఢిల్లీ, మార్చి 12 : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపియన్ అమీర్‌ఖాన్ తన అభిమాని అని తెలిసి బిగ్‌బి అమితాబ్ ఎంతో సంబరపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్‌లో పోస్ట్ చేసుకున్నారు. తన లండన్ పర్యటనలో అమీర్ ఖాన్ కుటుంబంతో సహా వచ్చి తనతో ఫోటో తీయించుకున్నాడని అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అలాగే తన సినిమాలను ఇష్టంగా చూస్తానని చెప్పాడని బిగ్‌బి తెలిపారు. జీవితాన్ని బాక్సింగ్ రింగ్‌తో పోలుస్తూ, నిరంతరం జీవితంతో పోరాడే వాడు ఎప్పుడూ దృఢంగా తయారవుతాడని తన సహజశైలిలో రచనా శైలికి మెరుపులు అద్దారు.
లాస్ ఏంజిల్స్ : ప్రపంచ ఉత్తమ స్థాయి సినిమా పండుగ 82వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఇక్కడి కొడక్ థియేటర్ లో కన్నుల పండువగా జరుగుతోంది. అంతర్జాతీయ శతవార్షిక మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ దర్శకత్వం అవార్డును మహిళ దక్కించుకుంది. 'ది హర్ట్ లాకర్' చిత్రానికి దర్శకత్వం వహించిన క్యాథరిన్ బ్రిగెల్లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును అందుకుంది. ఆస్కార్ అవార్డుల రేసులో 'అవతార్' సినిమాను తోసిరాజని 'ది హర్ట్ లాకర్' ముందుకు దూసుకుపోయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డులను హర్ట్ లాకర్ గెలుచుకుంది
ఉత్తమ నటుడి అవార్డును 'ది క్రేజీ హార్ట్' లో అత్యంత ప్రతిభావంతమైన నటనను ప్రదర్శించిన జెఫ్ బ్రిడ్జెస్ అందుకున్నారు. ఉత్తమ నటిగా 'ది బ్లైండ్ సైడ్' చిత్రంలో అద్భుతంగా నటించిన సాండ్రా బుల్లాక్ అవార్డును గెలుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా క్రిస్టోఫ్ వాల్ట్ జ్, ఉత్తమ సహాయనటిగా మో నిక్ ఎంపికయ్యారు. ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా 'అప్' అవార్డుకు ఎంపికైంది. ఆస్కార్ అవార్డుల రేసులో ముందుంటుందని అందరూ భావించిన 'అవతార్' చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆస్కార్ బహుమతులు దక్కించుకుంది. 'ద యంగ్ విక్టోరియా' చిత్రానికి కాస్ట్యూమ్స్ రూపొందించిన సాండీ పోవెల్ ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా 'ది కోవ్' సినిమా ఎంపికైంది.
ఉత్తమ ఫారిన్ లాంగ్వేజ్ సినిమా విభాగంలో అర్జెంటీనాకు చెందిన 'ది సీక్రెట్ ఇన్ దైర్ ఐస్' చిత్రం అవార్డు గెలుచుకుంది. స్టార్ ట్రేక్ సినిమాకు పనిచేసిన బార్నీ బర్మన్ ఉత్తమ మేకప్ మాన్ గా అవార్డు అందుకున్నారు. ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ విభాగంలో 'అప్' చిత్రానికి సంగీతం అందించిన మేఖేల్ జియాచినో అవార్డు తీసుకున్నారు. ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో క్రేజీ హార్ట్ చిత్రానికి అవార్డు లభించింది. ఇత్తమ యానిమేషన్ లఘు చిత్రంగా 'లోగోరమ', బెస్ట్ లైవ్ యాక్షన్ విభాగంలో 'ది న్యూస్ టెనెంట్స్' అవార్డులు అందుకున్నారు.
హైదరాబాద్ : మన పురాణాల గురించి మీకు తెలుసు తొమ్మిది అవతారాల తరువాత ప్రజలకు మంచి చేయడానికి దశావతారాన్ని దాల్చారు, పదవ అవతారంతో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించవచ్చు అని శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ శ్రీకృష్ణ, మెంబర్ సెక్రటరీ దుగ్గల్ లేక్‌వ్యూ అతిధిగృహంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అంశంపై ఇప్పటి వరకు తొమ్మిది కమిటీలు వేశారు, ఈ తొమ్మిది కమిటీలు సాధించలేనిది పదవ కమిటీ సమస్యను పరిష్కరిస్తుందని ఆశించవచ్చునా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా, తొమ్మిది అవతారాల తరువాత కూడా భగవంతుడు పదవ అవతారాన్ని ఎత్తారని, ఆ రకంగా దశావతారంలో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించవచ్చునని తాను ఆశిస్తున్నట్టు శ్రీకృష్ణ తెలిపారు. కమిటీ హైదరాబాద్‌లో తొలిసారిగా జరిపిన పర్యటన సుహృద్భావ వాతావరణంలో విజయవంతంగా సాగిందని శ్రీకృష్ణ తెలిపారు. తొలి పర్యటనలో కేవలం కమిటీకి వౌలిక సదుపాయాలను పరిశీలించడానికి, పరిచయాల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. గవర్నర్ విందులో ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారని, చక్కని వాతావరణంలో అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. తొలుత ఒకరిపై ఒకరికి విశ్వాసం, నమ్మకం ఏర్పడడం అవసరం, తొలి సమావేశంలో కమిటీకి నాయకులకు మధ్య చక్కని విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఏర్పాటు కోసమా? లేక తెలంగాణ ఇవ్వకుండా ఉండేందుకా? అని విలేఖరులు ప్రశ్నించగా, తాము తెలంగాణ ఇవ్వడానికో, వద్దని చెప్పడానికో లేమని, సమస్యను గుర్తించి, దానికి పరిష్కార మార్గం సూచించేందుకు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు హోంమంత్రి ప్రకటించిన తరువాత కమిటీ అభిప్రాయం సేకరణ జరపడం ఏమిటని ఒక విలేఖరి ప్రశ్నించగా, తెలంగాణ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు హోంమంత్రి ప్రకటించడాన్ని రేపే తెలంగాణ ఇచ్చేస్తున్నాం అని ప్రకటించినట్టుగా భావించవద్దని శ్రీకృష్ణ తెలిపారు. అభిప్రాయ సేకరణ, సమస్యను తెలుసుకోవడం అన్నీ అందులోకి వస్తాయని హోంమంత్రి ప్రకటనపై తాను భావిస్తున్నానని శ్రీకృష్ణ తెలిపారు. చిదంబరం ప్రకటన తరువాత మారిన పరిస్థితిల్లో కమిటీ వేశారని తెలిపారు.
కొందరు కమిటీకి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని, అభివృద్ధితో పాటు వివిధ అంశాలపై కమిటీకి వచ్చిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని టిఆర్‌ఎస్ చేసిన డిమాండ్‌ను ప్రస్తావించగా, తమకొచ్చిన సమాచారంలో ముఖ్యమైన వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు శ్రీకృష్ణ తెలిపారు. త్వరలోనే శ్రీకృష్ణ కమిటీకి వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వారి అభిప్రాయ సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరగా, ఆమ్ ఆద్మీని కలుస్తామని కమిటీ ముందే ప్రకటించిందని, ఆమ్ ఆద్మీలో ముస్లింలు కూడా ఉంటారని తెలిపారు. అన్ని ఉర్దూ పత్రికల్లో కమిటీ నోటిఫికేషన్‌ను ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించనున్నట్టు తెలిపారు. గవర్నర్ విందు హాజరైనప్పుడు రాజకీయ పక్షాల నాయకులు చక్కని వాతావరణంలో మాట్లాడుకున్నారని, కమిటీకి వారి నుంచి పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ముంబాయి : ఇటీవలే విడుదలైన 'త్రీ ఇడియట్స్' సినిమా విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు మరో అదృష్టం కలిసి వచ్చింది. వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు గాను ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగనంత పెద్ద మొత్తంలో పారితోషికం ఆమిర్ కు లభించనున్నది. దుబాయ్ కి చెందిన ఒక టెలికమ్యూనికేషన్ సంస్థ 35 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అమీర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతవరకూ మరే ఇతర బాలీవుడ్ సెలబ్రిటీకీ ఇంత పెద్దమొత్తంలో పారితోషికం లభించలేదు. బాలీవుడ్ నటులకు దక్కిన అత్యదిక పారితోషికాలు కేవలం 12 కోట్లు, 15 కోట్ల రూపాయలు మాత్రమే. దుబాయ్ టెలికమ్యూనికేషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్ళపాటు మీడియా షూట్స్ కు, మీడియా ప్రకటనల్లో ఆమిర్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది.
ఇంత పెద్ద ఒప్పందంపై అమీర్ ఒప్పందం చేసుకోవడంపై 'అడ్వర్టైజ్ మెంట్ గురు'గా ప్రసిద్ధుడైన ప్రహ్లాద్ కక్కర్ సానుకూలంగా స్పందించారు. అమీర్ తొలిసారిగా 1993లో కోలా సంస్థ కోసం నటించిన వాణిజ్య ప్రకటనకు ప్రహ్లాద్ కక్కరే దర్శకత్వం వహించారు. 'డబ్బు ఎంత ఇచ్చామన్నది పక్కన పెట్టండి. ఎంతో కష్టపడి అమీర్ ఖాన్ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇదేమంత ఆశ్చర్యకరం కాదు. ఒక వ్యక్తి తన తెలివితేటలతోను, కష్టపడి ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలడనే దానికి అమీర్ ఉదాహరణగా నిలిచాడు' అన్నారు. అమీర్ ఖాన్ తో కలవడం వల్ల ఆ సంస్థకు కూడా మంచి ప్రయోజనమే కలుగుతుంది. ఎందుకంటే ప్రచారం స్క్రిప్టు విషయంలో అమీర్కచ్చితత్వం, అతని సొంత ఇమేజ్ కూడా సంస్థ ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభించగలదన్నారు.
హొజయిరీ వాణిజ్య ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ 15 కోట్లు, అక్షయ్ కుమార్ 15 కోట్లు, హృతిక్ రోషన్ 15 కోట్లు, సల్మాన్ ఖాన్ 12 కోట్ల రూపాయలు ఇంతవరకూ అత్యధిక పారితోషికం తీసుకున్నవారిగా నిలిచారు. తాజాగా అమీర్ కు దక్కిన 35 కోట్ల రూపాయల ఒప్పందం కారణంగా ఆ రికార్డులు వెనక్కిపోనున్నాయి. వాణిజ్య ప్రకటనల్లో నటనకు చెల్లించే పారితోషికం గత సంవత్సరం ఒక్కసారిగా పెరిగిపోయిందని ఒక లీడింగ్ అడ్వర్టయిజ్ మెంట్ నిర్మాత వ్యాఖ్యానించారు. కొత్తగా పరిశ్రమలో అడుగుపెట్టిన రణ్ బీర్ కపూర్ కు కూడా రెండేళ్ళ ఒప్పందం కోసం 7 కోట్ల రూపాయలను ఒక చెల్లించాల్సి వచ్చిందని మరో ప్రకటనకర్త తెలిపారు.

Loading Poll...