హైదరాబాద్ : భారత్ సంచార్ నిగమ్ లిమిటడ్ మరో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. మొబైల్ ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు వీలుగా రూపొందించిన త్రీజీ సేవలను రాష్ట్రంలో బుథవారం ప్రారంభించింది. నగరంలోని రవీంద్రభారతిలో గవర్నర్ నరసింహన్ ఈ త్రీజీ సేవలను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో చాలాకాలంగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఇపుడు త్రీజీ అందుబాటులోకి వచ్చింది. మార్చి నాటికల్లా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రారంభిస్తామని బీఎస్ ఎన్ ఎల్ అధికారులు ప్రకటించారు. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు పలు ప్రత్యేక పథకాలను కూడా ఈ సంస్థ ప్రకటించింది. కేవలం 30 పైసలకు లోకల్, 50 పైసలకు ఎస్టీడీ కాల్స్ చేసుకునే ఆఫర్ ను ప్రవేశపెడుతున్నట్లు బీఎస్ఎన్నెల్ ప్రకటించింది. త్రీజీ సర్వీసులను వినియోగించుకునేందుకు 10 కేబీ డాటా వినియోగానికి పైసా చార్జి చేస్తున్నట్లు పేర్కొంది. త్రీజీ సేవల్లో 3.6 ఎంబీ సామర్థ్యం వరుకు వినియోగించుకునే అవకాశం ఉంది.
Loading Poll...