హైదరాబాద్ : ఓ పత్రికాధినేత పార్టీ మార్చాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మార్వాడీ వర్గానికి చెందిన ఆయన తనకు కాంగ్రెస్ నాయకత్వం రాజ్యసభ సీటు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో తన సామాజిక వర్గానికే చెందిన ముఖ్యమంత్రి రోశయ్య కూడా తనను మోసం చేశారని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా మార్వాడీ, వైశ్య వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తనను కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీ రాజ్యసభ సీటు ఇవ్వకుండా అవమానించారని, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించి తన శక్తి ఏమిటో సోనియాకురుజువుచేస్తానని ఇటీవల తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగు తోంది.
టీడీపీ అధికారంలో ఉండగా అన్ని పత్రి కలూ ఆ పార్టీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే తానొక్క డినే కాంగ్రెస్‌కు అండగా నిలిచిన విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం విస్మరించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సానుకూల ప్రచారం చేసినందుకు తన పత్రిక సర్క్యులేషన్ అత్యంత దారుణంగా దిగజారి, కొత్త పత్రికల తర్వాత స్థానంలోకి రావలసివచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘ నేను కాంగ్రెస్‌కు ఎంతో సేవ చేశా. ఆర్థికంగా ఎంతో నష్టపోయా. వేరే రాష్ట్రంలో బాధ్యతలు అప్పగిస్తే కోటిన్నర రూపాయలతో బస్సు కొని తిరిగా. అయినా సోనియాగాంధీ అవన్నీ విస్మరించారు.
రోశయ్య కూడా నేను ఎంపీనయితే తన సామాజిక వర్గంలో తన పలుకుబడి తగ్గుతుందని భయంతో నాకు ఎంపీ రాకుండా అడ్డుకున్నారు. వీటికి త్వరలో మూల్యం చెల్లించుకోకతప్పద’ని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను బేరీజు వేసుకున్న ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ స్థాయి పార్టీ అయినందున, వ్యాపారపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న వ్యూహంతోనే ఆయన ఆ పార్టీలో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఆయన ఆ పార్టీ జాతీయ నేతలతో కూడా చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వెలికితీసి, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చేందుకు కృషి చే సి, కాంగ్రెస్‌కు తిరుగులేని గుణపాఠం చెబుతానని ఆయన ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Loading Poll...