హైదరాబాద్ : 'అల్లు' వారు మళ్లీ రాజకీయ తెరపైకి వస్తున్నారు. గత ఎన్నికల్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొని అభాసుపాలైన సినీ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ మళ్లీ పొలిటికల్ సెకెండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తెర వెనక్కి వెళ్లారు. తదనంతరం చాలామంది సీనియర్లు, చివరకు చిరంజీవికి వ్యక్తిగత మిత్రులైన నాయకులు కూడా అల్లు అరవింద్ నియంతృ త్వ పోకడల వల్లే పార్టీ ఓడిందని, పార్టీని సినిమా డిస్ట్రిబ్యూ షన్ కంపెనీగా మార్చి, ఏరియాల వారీగా టికెట్లు అమ్ముకు న్నారంటూ పార్టీ కోసం కష్టపడిన నాయకులే ధ్వజమెత్తి వెళ్లిపోయారు. పరకాల ప్రభాకర్ వంటి నేతలయితే స్వ యంగా పార్టీ ఆఫీసులోనే రాజీనామా ప్రకటించి, పీఆర్పీని ఒక విషవృక్షంగా అభివర్ణించడం సంచలనం సృష్టించింది.క్రమంగా తనపై విమర్శల దాడి పెరగడంతో పరిస్థితి గ్రహించిన అల్లు కొంతకాలం తెరవెనుకకు వెళ్లిపోయి, సినీ వ్యాపారంపై దృష్టి సారించారు. అయితే అసెంబ్లీ ఎన్ని కల తర్వాత అంతర్థానమై, మళ్లీ మున్సిపవ్ ఎన్నికల ముం దు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమయింది. పార్టీ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన అల్లు తిరిగి వస్తుండ టంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అల్లు వల్లే నేతలకు-చిరంజీవికి మధ్య దూరం పెరిగిందని, సిని మాల్లో మాదిరిగానే అరవింద్ ఉంటే చిరంజీవిని కలవనీ యరన్న అనుభవం గతంలోనే చవిచూసినందున ఈసారి కూడా పాత కథే పునరావృతమవుతుందేమోనని కార్యకర్త లు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినీ భ్రమ లు తొలగి, ప్రజల్లో తన స్థానమేమిటో, తానేమిటో తెలు సుకుని ఇప్పుడిప్పుడే ప్రజలకూ. కార్యకర్తలకూ దగ్గరవు తున్న పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ‘అల్లు’ మళ్లీ మునుపటి మాదిరిగా పరదా చాటుకు పంపిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం, వ్యూహా లు, ఎత్తుగడ లేని అల్లు వల్ల పార్టీ దెబ్బతిని, జిల్లా పార్టీ ఆఫీసులు కూడా మూతపడ్డ దుస్థితిని నేతలు గుర్తు చేసు కుంటున్నారు.
ఎంతో రాజకీయ అనుభవం ఉండి, మంచి పార్లమెంటేరియన్లుగా గుర్తింపు పొందిన కోటగిరి విద్యాధ రరావు, సి.రామచంద్రయ్య వంటి నేతలు కూడా ఏ మా త్రం రాజకీయానుభవంలేని అల్లు పక్షాన వకాల్తా తీసుకోవ డంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురిలో ఎవరి స్థాయి పెరిగింది? ఎవరి స్థాయి తగ్గింద న్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అల్లు సరిగ్గా ము న్సిపల్ ఎన్నికల ముందే ప్రత్యక్షం అవుతుండటం చర్చనీ యాంశమైంది. ఒకసారి టిక్కెట్ల అమ్మకాల ఆరోపణలకే పార్టీ భ్రష్టుపట్టి పోయిందని, మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఇంకెన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినందున కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ల అమ్మకాల ఆరోపణలు వస్తే పార్టీ ఇక కోలుకోవడ మే కష్టమంటున్నారు.
Loading Poll...