మంగుళూరు : కర్నాటకలోని మంగుళూరులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం కూలిపోవడంతో 159 మంది దర్మరణం పాలయ్యారు. మంగుళూరు ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ఘోరం జరిగింది. మంగుళూరు ఎయిర్‌పోర్టుకు 10 కి.మీ దూరంలో కెంజూరు లోయలో విమానం కూలి ముక్కలయింది.
7 గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మరో చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక ఏజే ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదాన్ని పసిగట్టి దాదాపు 8 అడుగుల ఎత్తునుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు ప్రాణాలతో బయట పడ్డ ప్రత్యక్ష సాక్షలులు వివరించారు. దుబాయ్ నుంచి మంగుళూరు వస్తున్న ఎయిరిండియా ( ఎక్స్ -812)విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Loading Poll...