న్యూఢిల్లీ : హోం మంత్రిత్వ శాఖ తప్పిదం వల్లనే దంతేవాడలో పోలీసులు మావోయిస్టులకు బలయ్యారని కేంద్ర హోంమంత్రి పి చిదంబరం పశ్చాత్తాపం వ్యక్తం చేసారు. సరైన ప్రణాళిక లేకుండా దంతేవాడలో ప్రవేశించినందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. న్యూఢిల్లీలోని జేఎన్ టియూ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి గురువారం సాయంత్రం చిదంబరం మాట్లాడారు. దంతేవాడలో వ్యూహాత్మక తప్పిదం కారణంగానే 76 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు బలయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. దంతేవాడలో ఉన్న పోలీస్టేషన్ కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారని అదే మావోయిస్టు దాడికి అవకాశం కల్పించిందని వివరించారు. సిబ్బంది లేమి తమ శాఖను తీవ్రంగా వేధిస్తోందని చిదంబరం పేర్కొన్నారు.
Last modified on Tuesday, 30 November 1999 05:30