న్యూఢిల్లీ : సీబీఐపై బీజేపీ యుద్ధం చేస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాస్త కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ధ్వజమెత్తారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవినీతి కార్యకలాపాలు సాగుతున్నా సీబీఐ మాత్రం గుజరాత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని తన కను సన్నలలో నడుపుతోందని, ఇది దేశానికి సిగ్గు చేటని గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ శాఖల్లో వేళ్లూనుకుంటున్న అవినీతిని రూపుమాపాల్సిన సీబీఐ కాంగ్రెస్ పార్టీ సేవలో తరిస్తోందని ఆయన మండిపడ్డారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో సాగుతున్న అవినీతిపై సీబీఐ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ తాము ఉద్యమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే నెల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడతమని ఆయన వివరించారు.
Last modified on Tuesday, 30 November 1999 05:30