హైదరాబాద్ : నాంపల్లికోర్టు ఆదేశాల మేరకు టెన్సీస్ స్టార్ సానియామీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్‌మాలిక్, ఆయేషాసిద్ధిఖీలపై గురువారం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తజంట సానియా, షోయబ్‌లకు మరో సమస్య ఎదురైంది. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది కలిసి ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసులు నమోదు చేసి విచారణ జరపాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది.
మజ్లుమీన్-ఎ-ఉమ్మతే మహ్మదియా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మొహిసిన్ బిన్ హుస్సేన్ మంగళవారం సానియా, షోయబ్‌లతోపాటు ఇమ్రాన్ మీర్జా, ఆయేషా సిద్దిఖీ, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, షోయబ్‌కు ఆయేషా నుంచి విడాకులు ఇప్పించిన ఇద్దరు ఖాజీలపై ఈ పిటిషన్ దాఖలు చేశారు. మొదట్లో తాను ఆయేషాను పెళ్లి చేసుకోలేదని చెప్పిన షోయబ్.. తర్వాత ఆమెకు తలాక్ ఇచ్చాడని, వీరు విడాకులు తీసుకున్నట్టు ఈ 12 మంది ప్రకటించారన్నారు. ముస్లింలలో అయోమయాన్ని సృష్టించడంతో పాటు వారి మతపరమైన భావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపించారు. కాగా, జాతీయ గీతాన్ని అవమానించిన కేసులో సానియాపై దాఖలైన కేసు విచారణను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది
Loading Poll...