న్యూఢిల్లీ : తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలన్న ప్రతిపాదనను సవాలు చేస్తూ చెన్నై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌తోఎట్టి సంబంధం లేకుండా తెలుగు,కన్నడ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా పొందిన తమిళ భాషాభివృద్ధికి అందజేస్తున్న రాయితీలన్నింటిని వెంటనే అందజేయాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ సాంస్కృతిక శాఖకు సూచించింది. తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన భాష హోదాను అందచేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని గత ఉగాదికి ముందు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అంబికాసోనీ ప్రకటించారు. తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది కానుకగాఈనిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు. అయితే ఈ రెండు భాషలకు ప్రాచీన హోదా కల్పించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ చెన్నై హైకోర్టులో దాఖలైన రిట్ పిటీషన్‌పై వెలువడే తీర్పుకు లోబడి తమ ప్రభుత్వ నిర్ణయం అమలవుతుందని ఆమెప్రకటించారు.
ఆమె ప్రకటన వెలువడి దాదాపు ఏడాది గడచినప్పటికీ ఇంతవరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెన్నై కోర్టులో దాఖలైన పిటీషన్ జోలికి పోయిన దాఖలాలు లేవు. ఈనెల 16న తెలుగు ఉగాది పండుగ అయినందున కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ లేదా సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించి కోర్టులో అచేతనంగాపడి ఉన్న పిటీషన్‌కు మోక్షం కలిగించాలని రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రధాని మన్‌మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. సాంస్కృతిక శాఖ ప్రధాని అధీనంలోఉన్నందున తక్షణమే తగిన న్యాయం చేయవలసిందిగా ఆయన కోరారు. ప్రధాని సూచన మేరకు యార్లగడ్డ న్యాయ శాఖ మంత్రి మొయిలీతో సంప్రదించగా ప్రాచీన భాష హోదా లభించిన తమిళానికి లభిస్తున్న అన్ని సదుపాయాలను తెలుగు, కన్నడ భాషలకు విస్తరింప చేయవలసిందిగా సాంస్కృతిక శాఖకు సూచించినట్లు తెలియచేశారు. ఈనిర్ణయం త్వరలోనే కార్యరూపం ధరిస్తుందని మొయలీ హామీ ఇచ్చినట్లు యార్లగడ్డ తెలియచేశారు
ఐక్యరాజ్య సమితి : భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండుల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమానికి (యుఎన్ఇపి) గుడ్ విల్ అంబాసడర్ గా సచిన్ ను నియమించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన తొలి క్రికెటర్ గా సచిన్ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ప్రజాభిమానం సచిన్ పురిటిగడ్డ భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను పర్యావరణంపై ప్రజల్లో చక్కని అవగాహన కలగించడానికి, పర్యావరణ పరిరక్షణకు చక్కగా ఉపయోగపడుతుందని శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో యుఎన్ఇపి అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా టెండుల్కర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ భూమిపై క్రికెట్ ఆడుతూ తాను అపరిమితానందం పొందుతున్నానన్నాడు. మనందరికీ ఇంత చోటు కల్పించిన ఈ భూమి కోసం ఇక ఇప్పుడు తాను ఏదైనా చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భూమి పరిరక్షణ అందరి ముందున్న ప్రధాన లక్ష్యం అన్నాడు. తనకు లభించిన సరికొత్త బాధ్యత ద్వారా వాతావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నాడు. యుఎన్ఇపితోను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి అభిమానులతోను కలిసి పనిచేయడం ద్వారా లక్ష్యం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు.
మంచి లక్షణం, మనో పరిపక్వత, వివేకం, వ్యక్తిత్వం ఉన్న టెండుల్కర్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు చక్కని ప్రచారం లభిస్తుందని, ఎక్కువ శాతం మందిలో అవగాహన కలుగుతుందన్న ధీమాను యుఎన్ఇపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషిం స్టీనర్ వ్యక్తం చేశారు. 2010 యుఎన్ అంతర్జాతీయ బయో డైవర్శిటీ సంవత్సరాన్ని పురస్కరించుకొని సచిన్ తమ సంస్థతో కలిసి పనిచేయడం హర్షదాయకం అన్నారు. జంతు సంతతి క్షీణించడం వల్ల ప్రపంచ పర్యావరణంపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతున్నదీ అత్యంత కింది స్థాయి ప్రజల్లో కూడా సచిన్ ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. సచిన్ టెండుల్కర్ గతంలో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) తరఫున ప్రచారం చేశాడు.
ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసడర్ గా సచిన్ నిర్వహించాల్సి ప్రధానమైన విధుల్లో భూమిపై పర్యావరణాన్ని కాపాడతామంటూ 'గ్రీన్ ప్లెడ్జ్'పై ప్రమాణం చేయిండం. ముంబాయిలోని డివై పాటిల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ముంబాయిలో ప్రారంభమవుతున్న మూడవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఉత్సవంలో ఈ ప్రమాణాన్ని చేయిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీల్లో తిలకిస్తుండగా గ్రీన్ ప్లెడ్జ్ ను సచిన్ నిర్వహిస్తాడు. 'The Earth is our home and together we must conserve our precious wildlife, forests and oceans. I am proud to pledge that I will play my part in caring for our natural heritage' అంటూ సచిన్ గ్రీన్ ప్లెడ్జ్ ప్రమాణం చేయిస్తాడు.
ప్రకాశం : మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అగ్రనేత శాఖమూరి అప్పారావును పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నెత్తి కొండ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో శాఖమూరి మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ నవీన్ చంద్ ధృవీకరించారు. శాఖమూరి అప్పారావు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆయనది వరంగల్ జిల్లా నర్సంపేట. అలిపిరి ఘటనకు వ్యూహరచన చేసింది శాఖమూరే.
1993 లో అరెస్టయి 2001 వరకు జైలు జీవితం గడిపారు. సిద్ధాంత రచన, క్యాడర్‌కు మావోయిజాన్ని బోధించడంలో శాఖమూరి దిట్ట. మావో సిద్ధాంతాలను బాగా నమ్మిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నపుడే ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. గతంలో రామకృష్ణ రక్షణ కమిటీలో కీలక భూమిక ఫోషించినట్లు సమాచారం. 2001లో విడుదలైన తర్వాత శాఖమూరి అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో కూడా ఈయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. శాఖమూరిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది.
రాష్ట్ర మావోయిస్టు నేత సోలిపేట కొండల్ రెడ్డి ఎన్‌కౌంటర్
వరంగల్ : తాడ్వాయి మండలం కొడిశాల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాష్ట్ర నేత సోలిపేట కొండల్ రెడ్డి హతమయ్యారు. కొండల్ రెడ్డి టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి బందువు. కొండల్ రెడ్డిది బూటకపు ఎన్‌కౌంటర్ అని సోలిపేట రాంలింగారెడ్డి అరోపించారు. అరెస్టు చేసినట్లు మీడియా దృష్టికి తెచ్చిన తర్వాత కూడా ఎన్‌కౌంటర్ చేయడం దారుణమని ఆయనన్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్య క్రమంగా పాలనపై పూర్తి పట్టు సాధిస్తున్నారా? తన డ్రీమ్ కేబినెట్‌ను రూపొందించుకునేందుకు ఆయన చర్యలు ప్రారంభించారా? ఇందుకు అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? జరుగుతున్న పరిణామాలు, సీఎం సన్నిహిత వర్గాల మాటలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! శాసనసభ సమావేశాలు ఈనెల 30తో ముగుస్తున్నందున వచ్చేనెల 4న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కచ్చితమైన ముహూర్తం ఎన్ని గంటలకు అనేదాన్ని ఖరారు చేయించే పనిలో సీఎం ఉన్నారనీ పేర్కొంటున్నాయి.
ఈనెల 25 ఉదయం 7.30కి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించి.. అక్కడి నుంచే ఫైళ్ల పరిశీలన జరపాలని రోశయ్య ఇప్పటికే నిర్ణయించారు. అందుకు అనుగుణంగా క్యాంపు కార్యాలయంలో మరమ్మతు పనులూ శరవేగంగా సాగుతున్నాయి. వీటిని సనత్‌నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తుండడం గమనార్హం. పనులన్నీ ఈనెల 14 నాటికల్లా పూర్తవుతాయని ఆర్ అండ్ బీ అధికారులు ఆయనకు వివరించారు.
అటు క్యాంపు కార్యాలయం నుంచి పాలనా వ్యవహారాల సమీక్షకు శ్రీకారం.. ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ ఒకదానివెంట ఒకటి సాగనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రోశయ్యపై కీలకమైన ఆర్థిక, ఇంధన శాఖల వంటి వాటి భారం ఉంది. దీనివల్ల ఆయనపై పనిభారం బాగా పెరుగుతోందని.. ఆయన ఒత్తిడికి లోనవుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం ఎప్పుడో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ రావాల్సి వచ్చిందని వివరిస్తున్నాయి. మొ త్తమ్మీద కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసిన తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినందు న.. కేబినెట్ విస్తరణకు ఇక ఎలాంటి అవరోధాలూ ఉండవని భావిస్తున్నారు.
ఇక శాఖల లెక్కల వద్దకొస్తే.. కీలకమైన ఆర్థిక శాఖ బా ధ్యతలను ఇప్పటిదాకా స్పీకర్‌గా ఉన్న ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించాలన్న యోచన లో రోశయ్య ఉన్నారని ఇప్పటికే ప్రచారం జ రుగుతోంది. అలాగే ఇంధన శాఖను మాజీ మంత్రి జానారెడ్డికి, అబ్కారీ శాఖను మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డికి అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి సభాపతిగా బాధ్యతలు అ ప్పగించే అవకాశాలున్నాయి! నిశ్శబ్ద విప్లవం! మెతగ్గా ఉన్నారంటూ తనపై వస్తున్న విమర్శ లు, కొందరు జగన్ వర్గీయుల తీరు నేపథ్యం లో.. చడీచప్పుడు లేకుండానే విస్తరణ విషయంలో తనదైన రీతిలో రోశయ్య ముందుకుసాగే అవకాశముందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
కేవలం విస్తరణకే పరిమి తం కాకుండా.. కీలకమైన సమయంలో తన కు వ్యతిరేకంగా పావులు కదిపిన వారిని తొలగించడం ద్వారా పాలనను గాడిలో పెట్టే ప్ర యత్నం చేయొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. కడప ఎంపీ జగన్ వద్దకు పలువు రు మంత్రులు క్యూకట్టడం.. ఆయనకు చెంది న దినపత్రికలో ప్రభుత్వంపై వ్యతిరేక కథనా లు ప్రచురితమవుతుండటంపై ఇటీవల తర చూ మంత్రివర్గ సమావేశాల్లో రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. ఈ ప్రస్తావన తేవడంలోని అసలు ఉద్దేశం.. మున్ముం దు తన వైఖరి ఏమిటో చెప్పకనే చెబుతూ, హెచ్చరికలు జారీ చేయడమేనని కొందరు చె బుతున్నారు.
ఈ క్రమంలో జగన్ వర్గానికి చె క్ చెప్పే దిశగా ఆయన చర్యలు తీసుకోవచ్చ న్న అభిప్రాయం బలపడుతోంది. ఆనం బ్రద ర్స్ వంటి వారికి చెక్ చెప్పే దిశగా ఇప్పటికే కొన్ని పరిణామాలు సంభవించాయని పే ర్కొంటున్నారు. 2009లో వైఎస్ గెలిపిస్తే, 2014లో జగన్ గెలిపిస్తాడంటూ ఆనం వివేకా వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఆయన వర్గీయురాలిగా పేరొందిన నెల్లూరు మేయర్ ఇంటిపై ఏసీబీ దాడులు జరగడాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తమ్మీద రోశయ్య ఎలా వ్యవహరించబోతున్నారన్నది తేలాలంటే వచ్చే నెల 4 వరకు వేచిచూడాల్సిందే!!
Loading Poll...