వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్ బిడ్ల ప్రక్రియ ఆదివారం కొలిక్కివచ్చింది. ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ చెన్నైలో బిడ్లను తెరిచారు. వివిధ పట్టణాల ఫ్రాంచైజీల కోసం దాదాపు ఐదు సంస్థలు బిడ్లను దాఖలు చేసాయని ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ మీడియాతో చెప్పారు. సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ గ్రూప్ అత్యధికంగా 370 మిలియన్ల డాలర్లతో మూడు పట్టణాల కోసం బిడ్ దాఖలు చేసిందని వివరించారు. అహ్మదాబాద్, నాగ్ పూర్ , పుణె నగరాల్లో ఎదో ఒక ఫ్రాంచీజీని కావాలని ఆ సంస్థ కోరిందని మోడి చెప్పారు. అయితే పుణె నగర ఫ్రాంచైజీని సహారా గ్రూప్ నకు కేటాయించినట్లు మోడీ వెల్లడించారు. అలాగే రెండెజ్వస్ స్పోర్ట్స్ వరల్డ్ లిమిటెడ్ సంస్ధ 333.33 మిలియన్ల డాలర్ల రెండో అత్యధిక మొత్తంతో కూడిన బిడ్ ను దాఖలు చేసిందన్నారు. ఈ మేరకు ఆ సంస్థకు కొచ్చీ పట్టణాన్ని కేటాయించామని మోడీ తెలిపారు.
ఐపీఎల్ కు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో రెండో బోర్డును ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని మీడియా ప్రస్తావించగా, మోడీ అటువంటి ప్రతిపాదనేమీ లేదని కొట్టిపారేసారు. ఐపీఎల్ ను ఇప్పటికిప్పుడు విస్తరించాలన్న యోచన ఏమీ తమకు లేదని స్పష్టం చేసారు. అలాగే ఆదానీ గ్రూప్, వీడియోకాన్ వంటి సంస్థలు కూడా బిడ్డింగ్ లో పాల్గొన్నప్పటికీ ఫలితం లేకపోయింది.
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న యుఐడీ ప్రాజెక్టుకు సహకరించేందుకు 10 ఐటీ కంపెనీలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఈ మేరకు ఎంపిక చేసిన 10 భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పది కంపెనీలకు యుఐడీ ప్రాజెక్టుకు సంబంధించి భద్రత పరమైన సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ను రూపొందించే బాధ్యతను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో యుఐడీ ఈ పది కంపెనీలకు ఈ మేరకు సమాచారం అందచేయనుందని తెలిసింది.
దేశ ప్రజలందరికీ పౌర గుర్తింపు కార్డులు జారీ చేయాలని యుపిఎ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐటీ దిగ్గజం నందన్ నిలేకనీ సారథ్యంలో యుఐడీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గుర్తింపు సంఖ్యను రూపొందించేందుకు అత్యంత భద్రతపరమైన సాఫ్ట్ వేర్ ను, అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాలని నిలేకనీ నిర్ణయించారు. ఇందుకు బిడ్ లు దాఖలు చేయాల్సిందిగా యుఐడీ ఐటీ కంపెనీలకు 2009 జనవరిలో యుఐడి కోరింది. అంతర్జాతీయస్థాయిలో పలు ఐటీ దిగ్గాజాలు పోటీ పడి మరీ బిడ్డింగ్ లో పాల్గొన్నాయి. మొత్తం 19 ఐటీ కంపెనీలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి. అయితే ఈ 19 కంపెనీల్లో కేవలం 10 పది ఐటి కంపెనీలను యుఐడి ఎంపిక చేసినట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఈ పది ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలతో పాటుగా మహీంద్రా సత్యం, లాజికా, మైండ్ ట్రీ, మాస్టెక్, సీమెన్స్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటుగా ఎం ఎన్ సిలు అయిన ఐబీఎం, యాక్సెంట్యూర్ కంపెనీలు బిడ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు దాదాపుగా 19 బిలియన్లు కేటాయించింది. ఆగస్టు 2010 నుండి ఫిబ్రవరి 2011 మధ్య కాలంలో ఏపుడైనా ఈ యూనిక్ నంబర్లు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో ఈ పది కంపెనీల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఇతర ఏజెన్సీలకు చిక్కితే సంభవించే దుష్ఫలితాలపై కూడా యుఐడీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అత్యంత భద్రతాపరమైన సాఫ్ట్ వేర్ ను రోపొందించాలని యుఐడి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇపుడు పది ఐటీ కంపెనీల సహకారం కూడా యుఐడీ తీసుకోవడంతో ఇక ప్రాజెక్టు వేగవంతం కానుంది.
Loading Poll...