ముంబాయి : క్రికెట్ మాస్ట్రో సచిన్ టెండుల్కర్ పై రాళ్ళదాడులు చేసిన శివసేన ఇప్పుడు పూలగుత్తులతో ప్రశంసలు కురిపిస్తోంది! 'ముంబాయి అందరిదీ' అంటూ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తిపోయిన శివసేన సచిన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. మరాఠీలు కానివారెవరూ ముంబాయిలో ఉండడానికి వీల్లేదంటూ శివసేన ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో సచిన్ పై విధంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ లో జరిగిన రెండో వన్డేలో సచిన్ టెండుల్కర్ చేసిన 'అజేయ ద్విశతకం' ఇప్పుడు ఆయన విమర్శకుల నోళ్ళు మూయించడమే కాదు, శివసేనను కూడా క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ ద్విశతకంతో వన్డేల్లో సచిన్ ప్రపంచ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.
'వీరులు మహారాష్ట్రలోనే పుడతారు. మొఘలులను ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ఓడించాడు. క్రికెట్ యుద్ధంలో సచిన్ టెండుల్కర్ కూడా అలాంటి వాడే. యుద్ధంలో శివాజీ తన కరవాలాన్ని వినియోగించాడు. అదే విధంగా సచిన్ తన బ్యాట్ ను ఉపయోగించాడు' అంటూ ప్రశంసించారు శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే. 'నూరు కోట్ల భారతీయులు సచిన్ టెండుల్కర్ కు ఎప్పుడో భారతరత్న కిరీటాన్ని అలంకరించారు' అంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో ప్రశంసల జల్లు కురిపించారు. సచిన్ కు భారతరత్న ఇవ్వాలని ఎవ్వరూ రికమండ్ చేయాల్సిన అవసరం లేదంటూ బాల్ థాకరే తన సంపాదకీయంలో రాశారు. ఎందుకంటే సచిన్ ఇప్పటికే 'భారతరత్న' అని ప్రశంసించారు.
ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తమకు సామాన్యుడే దిక్సూచి అని శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొన్నారు. కొన్ని పార్టీలు తమ కమిటీని వ్యతిరేకిస్తున్నయన్నారు. అయినప్పటికీ అందరినీ కలుపుకొని వెళతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు మాత్రమే తాము లేఖలు రాశామన్నారు. ఆయా పార్టీలు తమకు ఎన్ని అభిప్రాయాలు అందజేసినా స్వీకరిస్తామన్నారు. ప్రత్యేక, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం తొలిసారిగా హైదరాబాద్ వచ్చింది. కమిటీ సభ్యులు బస చేసిన లేక్ వ్యూ అతిథిగృహంలో రాత్రి 7 గంటలకు కొద్దిసేపు మాత్రమే నిర్వహించిన మీడియా సమావేశంలో జస్టిస్ శ్రీకృష్ణ మాట్లాడారు. అనంతరం కమిటీ సభ్యులంతా రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యేందుకు తరలివెళ్ళారు.
తమ కమిటీకి రాష్ట్రంలో చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే ఇప్పుడు వచ్చామని శ్రీకృష్ణ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకుంటామన్నారు. 1952 నుంచీ రాష్ట్రంలో ప్రాంతాలవారీగా జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తామన్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆయా పార్టీల సొంత వ్యవహారమని జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు తమ కమిటీకి సహకరిస్తాయని భావిస్తున్నామన్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలను కూడా ప్రత్యక్షంగా కలుసుకొని చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకే కేంద్రం తమ కమిటీని నియమించిందని చెప్పారు. తమ కమిటీ నివేదిక సమర్పించిన తరువాతే కేంద్రం చర్యలు తీసుకుంటుందని
లక్నో : ప్రసాదం పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట 63 మంది భక్తులను బలి తీసుకుంది. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు 160 కిలోమీటర్ల దూరంలోని ప్రతాప్ గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో గురువారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్వామి రామ్ కృపాలు బాబా నిర్వహిస్తున్న ఓ ధార్మిక కార్యక్రమంలో ప్రసాదం పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆలయం ప్రధాన ద్వారం గేటు విరిగిపోయి ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది. స్వామి రామ్ కృపాలు బాబా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దుర్ఘటన జరిగిన సమయంలో ఆలయంలో సుమారు 10 వేల మంది భక్తులు ఉన్నారని అంచనా.
ముంబాయి : ఇటీవలే విడుదలైన 'త్రీ ఇడియట్స్' సినిమా విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు మరో అదృష్టం కలిసి వచ్చింది. వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు గాను ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగనంత పెద్ద మొత్తంలో పారితోషికం ఆమిర్ కు లభించనున్నది. దుబాయ్ కి చెందిన ఒక టెలికమ్యూనికేషన్ సంస్థ 35 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అమీర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతవరకూ మరే ఇతర బాలీవుడ్ సెలబ్రిటీకీ ఇంత పెద్దమొత్తంలో పారితోషికం లభించలేదు. బాలీవుడ్ నటులకు దక్కిన అత్యదిక పారితోషికాలు కేవలం 12 కోట్లు, 15 కోట్ల రూపాయలు మాత్రమే. దుబాయ్ టెలికమ్యూనికేషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్ళపాటు మీడియా షూట్స్ కు, మీడియా ప్రకటనల్లో ఆమిర్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది.
ఇంత పెద్ద ఒప్పందంపై అమీర్ ఒప్పందం చేసుకోవడంపై 'అడ్వర్టైజ్ మెంట్ గురు'గా ప్రసిద్ధుడైన ప్రహ్లాద్ కక్కర్ సానుకూలంగా స్పందించారు. అమీర్ తొలిసారిగా 1993లో కోలా సంస్థ కోసం నటించిన వాణిజ్య ప్రకటనకు ప్రహ్లాద్ కక్కరే దర్శకత్వం వహించారు. 'డబ్బు ఎంత ఇచ్చామన్నది పక్కన పెట్టండి. ఎంతో కష్టపడి అమీర్ ఖాన్ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇదేమంత ఆశ్చర్యకరం కాదు. ఒక వ్యక్తి తన తెలివితేటలతోను, కష్టపడి ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలడనే దానికి అమీర్ ఉదాహరణగా నిలిచాడు' అన్నారు. అమీర్ ఖాన్ తో కలవడం వల్ల ఆ సంస్థకు కూడా మంచి ప్రయోజనమే కలుగుతుంది. ఎందుకంటే ప్రచారం స్క్రిప్టు విషయంలో అమీర్కచ్చితత్వం, అతని సొంత ఇమేజ్ కూడా సంస్థ ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభించగలదన్నారు.
హొజయిరీ వాణిజ్య ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ 15 కోట్లు, అక్షయ్ కుమార్ 15 కోట్లు, హృతిక్ రోషన్ 15 కోట్లు, సల్మాన్ ఖాన్ 12 కోట్ల రూపాయలు ఇంతవరకూ అత్యధిక పారితోషికం తీసుకున్నవారిగా నిలిచారు. తాజాగా అమీర్ కు దక్కిన 35 కోట్ల రూపాయల ఒప్పందం కారణంగా ఆ రికార్డులు వెనక్కిపోనున్నాయి. వాణిజ్య ప్రకటనల్లో నటనకు చెల్లించే పారితోషికం గత సంవత్సరం ఒక్కసారిగా పెరిగిపోయిందని ఒక లీడింగ్ అడ్వర్టయిజ్ మెంట్ నిర్మాత వ్యాఖ్యానించారు. కొత్తగా పరిశ్రమలో అడుగుపెట్టిన రణ్ బీర్ కపూర్ కు కూడా రెండేళ్ళ ఒప్పందం కోసం 7 కోట్ల రూపాయలను ఒక చెల్లించాల్సి వచ్చిందని మరో ప్రకటనకర్త తెలిపారు.
ముంబాయి : క్రికెట్ మాస్ట్రో సచిన్ టెండుల్కర్ పై రాళ్ళదాడులు చేసిన శివసేన ఇప్పుడు పూలగుత్తులతో ప్రశంసలు కురిపిస్తోంది! 'ముంబాయి అందరిదీ' అంటూ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తిపోయిన శివసేన సచిన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. మరాఠీలు కానివారెవరూ ముంబాయిలో ఉండడానికి వీల్లేదంటూ శివసేన ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో సచిన్ పై విధంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ లో జరిగిన రెండో వన్డేలో సచిన్ టెండుల్కర్ చేసిన 'అజేయ ద్విశతకం' ఇప్పుడు ఆయన విమర్శకుల నోళ్ళు మూయించడమే కాదు, శివసేనను కూడా క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ ద్విశతకంతో వన్డేల్లో సచిన్ ప్రపంచ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.
'వీరులు మహారాష్ట్రలోనే పుడతారు. మొఘలులను ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ఓడించాడు. క్రికెట్ యుద్ధంలో సచిన్ టెండుల్కర్ కూడా అలాంటి వాడే. యుద్ధంలో శివాజీ తన కరవాలాన్ని వినియోగించాడు. అదే విధంగా సచిన్ తన బ్యాట్ ను ఉపయోగించాడు' అంటూ ప్రశంసించారు శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే. 'నూరు కోట్ల భారతీయులు సచిన్ టెండుల్కర్ కు ఎప్పుడో భారతరత్న కిరీటాన్ని అలంకరించారు' అంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో ప్రశంసల జల్లు కురిపించారు. సచిన్ కు భారతరత్న ఇవ్వాలని ఎవ్వరూ రికమండ్ చేయాల్సిన అవసరం లేదంటూ బాల్ థాకరే తన సంపాదకీయంలో రాశారు. ఎందుకంటే సచిన్ ఇప్పటికే 'భారతరత్న' అని ప్రశంసించారు.
Loading Poll...