హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి రోశయ్య సిద్ధమవుతున్నా రు. తెలంగాణ ఉప ఎన్నికలు కూడా ముగియడం, మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేసేందుకు దాదాపు నిర్ణయించ డంతో రోశయ్య ఇక మంత్రివర్గ విస్త రణపై దృష్టి సారించారు. ఆ మేరకు అధిష్ఠానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆగస్టు చివరి వారంలో గానీ, సెప్టెంబర్ మొదటి వారంలో గానీ విస్తరణ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోశయ్యకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలలో కూడా దీనిపై అసహనం వ్యక్తమవుతోంది.
పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం... ఈ నెల 25, 29 లేదా సెప్టెం బర్ 1న మంత్రివర్గ విస్తరణ ఖాయంగా ఉండవచ్చంటున్నారు. రోశయ్య నామ నక్షత్రం ప్రకారం.. పౌర్ణమి మరుసటి రోజయిన పాఢ్యమి ఆగస్టు 25న, దానితోపాటు పంచమి ఆదివారం (అశ్విని నక్షత్రం) 29న గానీ.. సప్తమి, అష్టమి కలసి వచ్చే సెప్టెంబర్ 1న గానీ మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని చెబుతున్నారు. ఈ తేదీలను పండితులు కూడా ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
వీటిలో సెప్టెం బర్ 1 చాలా అనుకూలంగా ఉందంటు న్నారు. విస్తరణకు సంబంధించి ఇప్పటికే అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసు కున్నప్పటికీ, మళ్లీ ఈనెల మధ్యలో ఇదే అంశంపై రోశయ్య జాబితాతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని మొత్తంగా ప్రక్షాళన చేసి, తనకు అనుకూలురయిన వారిని ఎంపిక చేసుకునేందుకు రోశయ్యసిద్ధమవుతున్నారు. వ్యక్తిగత అజెండాలు లేకుండా తనకు, పార్టీకి విధేయులయిన వారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకే మొగ్గుచూపుతు న్నారు. తాను చేస్తున్న ప్రతిపాదనలు, సూచనలను మంత్రులు వ్యతిరేకించడం రోశయ్యకు అసంతృప్తి కలిగిస్తోంది.
ఇటీవల బయ్యారం గనులపై విచారణ జరిపిద్దామన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనను చాలామంది మంత్రులు వ్యతిరేకిం చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామంది జగన్ వర్గీయులుగా ముద్రపడ్డారు. జగన్ వచ్చిన ప్రతిసారీ వారంతా ఆయనను కలసివస్తూనే ఉన్నారు. కాగా, మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రాయలసీమ- తెలంగాణ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని ఉప ముఖ్యమంత్రులుగా తీసుకోవ చ్చని సమాచారం.
వేర్పాటు వాదం పెరిగిపోతున్న సమయంలో పార్టీని పటిష్ఠ పరచడంతో పాటు, ప్రాంతీయ సమతుల్యం, సీనియర్ల అసంతృప్తిని కూడా తగ్గించవచ్చన్న వ్యూహంతో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను తీసుకోవాలని యోచిస్తున్నారు. ప్రధానంగా.. తెలంగాణ నుంచి తప్పనిసరిగా ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా పెద్ద మనుషుల ఒప్పందాన్ని గౌరవిం చినట్లు ఉంటుందని భావిస్తున్నారు. కోస్తా నుంచి రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందున, రాయలసీమ నుంచి ఉప ముఖ్యమంత్రిని తీసుకుంటే ప్రాంతీయ సమతుల్యత పూర్తిగా పాటించినట్టవుతుందని యోచిస్తున్నారు.
న్యూఢిల్లీ,జూన్ 9: ఓదార్పు యాత్ర మూలంగా కాంగ్రెస్ అధినాయకత్వంతో పేచీ పెట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడు, లోక్‌సభ సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఎన్.సి.పి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌తో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుండటం తెలిసిందే. కాంగ్రెస్ అధినాయకత్వం నుండి అందిన సూచన మేరకు జూలై 8 తేదీ వరకు తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు జగన్ ప్రకటించటం తెలిసిందే. కాంగ్రెస్ అధినాయకత్వం జూలైలో కూడా ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వని పక్షంలో ఏం చేయాలనేది జగన్‌మోహన్ రెడ్డి ముందుకున్న ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే కార్యక్రమంలో భాగంగానే ఆయన శరద్ పవార్‌తో మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ అధినాయకత్వం తనను కట్టడి చేయటం ఇష్టం లేని జగన్‌మోహన్ రెడ్డి కొత్త సమీకరణాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జగన్‌మోహన్ రెడ్డి తన భవిష్యత్ రాజకీయం గురించి శరద్ పవార్‌తో చర్చించారని అంటున్నారు. ఎన్.సి.పిలో చేరాలంటూ శరద్ పవార్ చేసిన ప్రతిపాదన గురించి జగన్‌మోహన్ రెడ్డి తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా అసమ్మతి నాయకుడిగా కొనసాగుతున్నప్పుడు శరద్ పవార్‌తో దోస్తీ చేయటం తెలిసిందే. శరద్ పవార్ సలహా మేరకే ఆయన ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభించే దిశగా ప్రయత్నాలు కూడా జరిపారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కూడా తన భవిష్యత్ రాజకీయం కోసం శరద్ పవార్ వైపు చూస్తున్నారని అంటున్నారు. జగన్‌మోహన్ రెడ్డి ముందు ప్రకటించిన ప్రకారం జూలై ఎనిమిదో తేదీనాడు శ్రీకాకుళంలో ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేరోజు ఆయన తన భవిష్యత్ రాజకీయ కార్యక్రమం గురించి ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.
Loading Poll...